విశాఖపట్నం జిల్లాలో...
విశాఖపట్నం రైల్వే డీజిల్ లోకో షెడ్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న రాము అనే వ్యక్తి.. గోపాలపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈఘటనకు కారకుడైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో...
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడులో జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని బంధువులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లాలో...
పామూరు మండలం గోపాలపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి చెందాడు. కనిగిరి జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని అధిగమించేందుకు ప్రయత్నించిన కారు... ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎల్ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత