ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద పుల్లరిపాలెం తాజా మాజీ ఎంపీటీసీ కోడూరి వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన సమస్యను విన్నవించుకునేందుకు కుటుంబంతో సహా కలెక్టరేట్‌కు వచ్చిన వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అతన్ని ఆటోలో రిమ్స్ కు తరలించారు.
ఆమంచి వర్గీయులు పోలయ్య, అతని కుమారులు తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని... ఇల్లు, ఊరు వదిలి వెళ్లకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడటం వల్లే తన తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కోడూరి కుమారుడు తెలిపారు. వేటపాలెం ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.