ETV Bharat / state

వీరన్నపాలెంలో విదేశీ పక్షులు... చూస్తే కలిగెను ఆనందం... - ప్రకాశం జిల్లాలో విదేశీ పక్షులు

విదేశీ పక్షులు ఆ ప్రాంత వాసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సంవత్సరంలో ఆరు నెలలు ఉండి పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ పిల్లలను పెడతాయి. వీటిని రక్షించటానికి గ్రామస్థులు రాత్రి పగలు అని తేడాలేకుండా కాపాల కాస్తున్నారంటే ఎంత విచిత్రంగా ఉంది... ప్రకాశం జిల్లా వీరన్నపాలెం పక్షులపై మీరు ఓ లుక్కేయండి!

Foreign birds at prkasm dst virranpalem
వీరన్నపాలెంలో విదేశీ విహంగం
author img

By

Published : Jan 6, 2020, 9:12 AM IST

Updated : Jan 10, 2020, 11:26 AM IST

ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం వీరన్నపాలెంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఏటా నవంబరులో వచ్చి మార్చి వరకూ ఉండి తిరిగి వెళ్లిపోతాయి. ఇలా పక్షులు వచ్చి సందడి చేయడం కొన్నేళ్ళగా సాగుతోంది. సరైన వసతిలేక వీటి రాక తగ్గింది. దీన్ని గమనించిన స్థానికులు... ప్రభుత్వ సహకారంతో తగిన చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి మళ్లీ పక్షుల కిలకిలరావం మొదలైంది. సైబీరియా నుంచి 5వేల కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఏటా ఇక్కడకు వలస వస్తున్నాయి.
అక్కడ చలితీవ్రత కారణంగా నవంబర్‌లో ఇక్కడకు వచ్చి, గుడ్లుపెట్టి, పిల్లలను పొదుగుతాయి. మార్చి వరకు ఇక్కడే ఉండి పిల్లలతో తిరుగుపయనమవుతాయి. ఫెలికాన్‌ జాతికి చెందిన ఈ పక్షులు పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలో కనిపిస్తాయి.. మళ్ళీ ఇక్కడే అవి కనిపిస్తాయి
ఈ పక్షలు కిలకిలరావాలను తమను ఉత్సాహపరుస్తాయని గ్రామస్థులు అంటున్నారు.. వీటిని వేటాడేందుకు జరిగే ప్రయత్నాలను గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. విహంగాలకు రక్షణగా నిలిచి ఎలాంటి హానీ కలగకుండా చూస్తున్నారు.

ఇదీ వీరన్నపాలెం పక్షుల అందం... చూడాలంటే మీరు మార్చిలోపు వేళ్లండి మరి!

వీరన్నపాలెంలో విదేశీ విహంగం

ఇదీ చూడండి మంగళగిరిలో రైతుల ఆందోళన'

sample description
Last Updated : Jan 10, 2020, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.