ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సంధాని అనే దివ్యాంగుడు పని చేస్తున్నారు. పుట్టుక నుంచి కుడి కాలు, కుడి చేయి ఆయనకు సక్రమంగా పనిచేయవు. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఉద్యోగ విధుల్లో భాగంగా ఒంగోలు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీమకుర్తికి వెళ్లి వస్తుంటారు.
పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి రవాణా ఛార్జీలు భారంగా మారిన పరిస్థితుల్లో.. ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారు. దానిపై ప్రయాణిస్తూ తన పనులు తాను చూసుకుంటున్నారు. 5 గంటలు ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: