ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారులతో మత్స్యశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీ శ్రీకాంత్‌లు మత్స్యకారులతో మాట్లాడారు. జిల్లాలో సముద్రంలో చేపల వేటకు బల్లవల, ఐలా వలలను నిషేధించామని.. రెండు రోజుల్లో ఇరుగ్రామాల మత్స్యకారుల వివాదానికి తెరపడుతుందన్నారు.
వాడరేవు, కటారివారి పాలెం మత్స్యకారుల మధ్య వివాదంతో జిల్లాలో ఇప్పటికే బల్లవల, ఐల వలలతో వేటను నిషేధించినందున.. మిగతా వలలతో మత్స్యకారులు వేటను యథావిధిగా కొనసాగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. రెండు రోజుల్లో జిల్లాకు మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు రానున్నారని.. మంత్రి సమక్షంలోనే రెండు మత్యకార గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని జేడీ అన్నారు.
ఇదీ చదవండి: ఇరిగేషన్ కార్యాలయానికి తాళం వేసి రైతుల నిరసన