నివర్ తుపాన్ ముంచుకొస్తోందని అధికారుల హెచ్చరికల జారీతో ప్రకాశం జిల్లాలోని సముద్రతీరంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. చీరాల మండలం వాడరేవు, వేటపాలెం, చినగంజాం సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు తుపాన్ హెచ్చరికలు జారీచేశారు. తీరంలో అధికారులు దండోరా వేయించారు. చేపల వేటకు వెళ్లిన వారు ఒడ్డుకు తిరిగి రావాలని, పడవలు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఇదీ చదవండి:
నివర్ తుపాన్: నెల్లూరు, రాయలసీమకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన