ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగిన ఘటనలో 15 మంది మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కురిచేడులో మండలస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శానిటైజర్ తాగిన వాళ్ళను వాలంటీర్ల సహాయంతో గుర్తించి.. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులని కోరారు. ఇప్పటివరకు 37మందిని గుర్తించి వారిని రిమ్స్ హాస్పిటల్ కి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందింస్తున్నామని తెలిపారు.
మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని సీఎంవో కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు తన వంతు తక్షణ ఆర్థిక సహాయంగా 25,000రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు