ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన షేక్ జానీభాషా అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద ఆస్రత్రిలో చేరారు. లివర్ సమస్య కావటంతో ఖర్చులు అధికంగా అవుతాయని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి సురేష్ దృష్టికి తీసుకు రావటంతో వెంటనే స్పందించిన ఆయన.. సీఎం సహాయనిధి నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. గురువారం బాధిత కుటుంబ సభ్యులకు గుంటూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్ అందజేశారు. తమకు సహాయం చేసిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి