డబ్బులు ఇవ్వలేదని భార్యపై కోపంతో.. 6 నెలల పసి కందును గొంతు నులిపి చంపిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపలెం మండలం అమనిగూడిపాడులో చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన బాల ఏసు వ్యసనాలకు బానిసైయ్యాడు. డబ్బులివ్వమని భార్యను అడగగా.. తన దగ్గర లేవని చెప్పడంతో కోపంతో పక్కనే ఉన్న ఆరు నెలల కూతురి గొంతు నులిమేశాడు. భార్య అడ్డుకునేందుకు ప్రయతించినప్పటికీ ఆ పసికందు ప్రాణాలు నిలువ లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: 2300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం