ప్రకాశం జిల్లా ఇంకోల్లు మండలం భీమవరంలో నీటమునిగిన మిర్చి పంటను చూసి గుండె పోటుతో రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన రాజోలు పెద్ద యోగయ్య(38) అనే రైతు నాలుగున్నర ఎకరాలల్లో మిర్చి పంటను వేసి సాగు చేస్తున్నాడు. నివర్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షానికి పంట నీటమునిగింది. రోజు మాదిరిగానే పొలానికి వెళ్ళిన రైతు అది చూసి ఆందోళనకు గురయ్యాడు. నీటినితోడి బయటకు పారపోస్తుండగా ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
అప్పు తీర్చలేననే మనస్తాపం
మిర్చి పంట వేసేందుకు రూ.6లక్షల వరకు అప్పుచేశాడని వాటిని తీర్చలేనన్న మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: