ETV Bharat / state

ఆశ..నిరాశల ఆరాటం..! - వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సమస్యల వార్తలు

ప్రభుత్వాలు మారుతున్నా...కొత్త పథకాలు పుట్టుకొస్తున్నా వారి జీవితాల్లో మార్పు రావడంలేదు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోలేరు. ఉన్నవాటిలో ఉంటూ కాలం వెల్లదీయలేరు. సంవత్సరాలుగా అభివృద్ధికి దూరమై, ప్రభుత్వానికి భారమై బతుకీడుస్తున్నారు.

ఆశ..నిరాశల ఆరాటం..!
ఆశ..నిరాశల ఆరాటం..!
author img

By

Published : Nov 14, 2020, 6:23 PM IST

పక్క గ్రామాలు ప్రగతిబాటన పయనిస్తుంటే మాకెందుకు ఈ దుస్థితి అని గుండెలు అవిసే బాధలో బిక్కుబిక్కుమంటున్నారు వాళ్లు. దీనంతటికీ కారణం ముంపు జాబితాలో వారు ఉండటమే. ఆప్రాజెక్టు వస్తే తమతోపాటు జిల్లాకు మేలు జరుగుతందని ఎంతో ఆశపడ్డారు. పాజెక్టు ఉద్దేశాన్ని గ్రహించి త్యాగాలకు సిద్ధమయ్యారు. అయినా వారి అవస్థలు తగ్గడం లేదు. సమస్యలకు పరిష్కారం లభించడంలేదు. పనులూలేక...పునరావాసం లేక ఏళ్లుగా కన్నీళ్లతో మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ప్రాజెక్టు వెలుగొండ కాగా...ఆ అభాగ్యులు ముంపు ప్రాంతాల నిర్వాసితులు.

వెలుగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించడం. పనులు ప్రారంభించి పదిహేనేళ్లు అవుతున్నా బాధితులకు పునరావాసం సాధ్యం కాలేదు. కొన్ని గ్రామాలకు సంబంధించిన భూసేకరణ కూడా ఇంకా పూర్తికాలేదు. మరికొన్నింటికి భూసేకరణ చేసినా కాలనీల నిర్మాణం చేపట్టలేదు. నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో కూడా ఇంకా సందిగ్ధం వీడలేదు. ఏళ్లుగా ఓపికతో నిరీక్షిస్తూనే ఆ నిర్వాసితుల బతుకులు చితికిపోయాయి. అయినా వారి సమస్యలు ఇంకా కొల్కి రాలేదు. అయిదు నెలల నుంచి అధికారులు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించి హడావుడి చేస్తున్నా... తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్‌ఐలు, వీఆర్వోలు ఇతర అధికారులను బృందాలుగా విచారణ కమిటీలు వేసినా పరిహారానికి సంబంధించిన అర్హుల జాబితా ఇంతవరకు తేలలేదు.

హడావుడి ఎక్కువే..

ఆరునెలల్లో వెలిగొండ టన్నెల్‌తోపాటు, ముంపు గ్రామాల్లో వరుస పర్యటనలు, అధికారులతో నిత్య సమీక్షలు ఎన్ని జరిగినా ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలకు పరిష్కారం లభించని పరిస్థితి. జూన్‌ 1న దోర్నాల మండలంలోని కొత్తూరులోని టన్నెల్‌ను, జూలై 10న అర్థవీడు మండలంలో కాకర్ల డ్యామ్​ను కలెక్టర్‌ ఇతర అధికారులు పరిశీలించారు. అదే నెల 30న వెలిగొండ ముంపు గ్రామాల్లో, ఆగస్టు 4న గొట్టిపడియ, కాకర్ల లింక్‌ కెనాల్‌ పనులను పరిశీలించారు. 8న అర్థవీడు మండలంలోని రామలింగేశ్వరపురం గ్రామంలో, 14న దోర్నాల మండలంలోని నిర్వాసితుల కేంద్రాన్ని పరిశీలించారు.

28న, సెప్టెంబరు 9న వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష. 18న దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలన. 25న సుంకేల గ్రామం పర్యటన. ఇలా వరస పర్యటనలు, సమీక్షలు, పరిశీలనలు 12 జరిగాయి.

కొత్తగా 2వేల దరఖాస్తులు

మూడేళ్లలో పూర్తి అవుతుందనుకున్న ప్రాజెక్టు పదిహేనేళ్లు అయినా పూర్తికాలేదు. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువుతాండ పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల, కాటంరాజుతాండ, చింతలముడిపి, అర్థవీడు మండలంలోని లక్ష్మీపురం, కృష్ణనగర్, సాయిరాంనగర్, రామలింగేశ్వరపురం తదితర గ్రామాల్లో నిర్వాసితుల నుంచి కొత్తగా 2వేల దరఖాస్తులు అందాయి. ఇవి ఇదివరకే అధికారులు గుర్తించిన అర్హుల సంఖ్యకు అదనం. కానీ అర్హుల జాబితా మాత్రం ప్రకటించలేదు. అయితే అర్థవీడు మండంలోని నాలుగు గ్రామాల్లో కొందరి ఖాతాల్లో ఇటీవలే వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద డబ్బులు జమ అయ్యాయి. మిగిలిన వారు పునరావాసం కోసం ఎదురు చూస్తున్నారు.

అప్పటికప్పుడు ఎలా?..

ఒక పక్క ఈఏడాది చివరికి వెలుగొండ మొదటి సొరంగం పనులు పూర్తిచేసి నీళ్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారని, దానికంటే ముందు చేయాల్సిన ముంపు ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారంపై మాత్రం ఆ స్థాయిలో దృష్టిసారించడంలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. చెప్పినట్లే ఈ ఏడాది చివరికి మొదటి సొరంగం పనులు పూర్తి అయితే సంతోషమేనని, అదే సమయంలో తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అప్పటికప్పుడు ఊరు విడిచి వేరేచోటుకి వెళ్లాలంటే పిల్లాజల్లా, గొడ్డుగోదతో ఎలా అని నిలదీస్తున్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతోపాటు అన్ని వసతులు కల్పించేవరకు ఊరు విడిచేదిలేదని తెగేసి చెబుతున్నారు. ముందుగా పునరావాసానికి సంబంధించి అక్కడ ఇళ్లు నిర్మాణం చేయాలని, కాలనీలో సౌకర్యాలు కల్పించిన తర్వాతనే వెళుతామంటున్నారు.

సౌకర్యాలు కల్పించాలి ..

గొట్టిపడియ గ్రామంలో ఎక్కువ శాతం మంది పునరావాసం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఇప్పుడు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద పరిహారం తీసుకున్నా ఎక్కడికి వెళ్లాలో తెలియదు. పునరావాస కాలనీల్లో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించాలి. అంత వరకు ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేయకూడదు.

- పుప్పాల గాలెయ్య, నిర్వాసితుడు, గొట్టిపడియ

అయిదు నెలల సమయం ఇవ్వాలి..

పునరావాసం కల్పించే కాలనీలో బడి, గుడి, రహదారులు, విద్యుత్తు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇల్లు నిర్మించుకోవడానికి కనీసం అయిదు నెలల సమయం ఇవ్వాలి. వందల మంది ఒకేసారి నిర్మాణాలు చేపట్టాలంటే ఇసుక, సిమెంట్‌ వస్తుసామగ్రి లభించక ఇబ్బందులు వస్తాయి. నెల రెండు నెలల్లో ఖాళీ చేయాలంటే కష్టమే. ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలి.

- పి.శ్రీనివాసులు, నిర్వాసితుడు, గొట్టిపడియ

జాబితా సిద్ధం చేస్తున్నాం

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని నిర్వాసితుల నుంచి కొత్తగా రెండు వేల దరఖాస్తులు వచ్చాయి. పునరావాసం, వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ కోసం పరిశీలించి జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం పరిహారం చెల్లించడంపై కసరత్తు చేస్తున్నాం. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించడం ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా జరుగుతుంది.

-బి.చంద్రలీలా, వెలిగొండ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్, మార్కాపురం

ఇదీ చదవండి: తెలుగు ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.