రాజధాని అమరావతి కోసం ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే నిర్వహించ తలపెట్టిన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ... ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన ఇంటి వెనుక నుంచి బైక్ ర్యాలీకి బయలుదేరారు. ఎక్కడిక్కడ పోలీసులను తప్పుదారి పట్టిస్తూ పట్టణంలో ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు సైతం రోడ్ల పైకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. చివరకూ.. ఓ ప్రదేశంలో దామచర్లను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీనిని మహిళలు అడ్డుకున్నారు. అతి కష్టం మీద ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: