ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మంగళకుంట గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాజీ పోలీస్ ఉన్నతాధికారి సతీమణి పోటీలో నిలిచారు. ఐదేళ్ల క్రితం ఆదర్శ గ్రామంగా మంగళకుంటను దత్తత తీసుకున్న ఐపీఎస్ అధికారి పిన్నిక హరికుమార్ పలు అభివృద్ధి పనులు చేశారు. స్వగ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సర్పంచిగా పోటీ చేస్తున్నట్లు ఆయన సతీమణి శారద తెలిపారు. మంగళకుంట గ్రామానికి ఏళ్ల తరబడి సరైన రహదారి లేకపోవడంతో ఐపీఎస్ అధికారి చొరవతోనే రహదారి వచ్చింది. కలుజువ్వలపాడు నుంచి రూ.3 కోట్లతో తారురోడ్డు వేశారు. గ్రామస్థులతో కలిసి బుధవారం శారద నామినేషన్ దాఖలు చేశారు.
సర్పంచి బరిలో మాజీ పోలీస్ ఉన్నతాధికారి సతీమణి.. - మంగళకుంట గ్రామపంచాయతీ తాజా వార్తలు
దత్తత తీసుకున్న గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఓ మాజీ పోలీస్ ఉన్నతాధికారి సతీమణి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్వగ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పోటి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం గ్రామస్థులతో కలిసి ఆమె నామ పత్రాలు సమర్పించారు.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మంగళకుంట గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాజీ పోలీస్ ఉన్నతాధికారి సతీమణి పోటీలో నిలిచారు. ఐదేళ్ల క్రితం ఆదర్శ గ్రామంగా మంగళకుంటను దత్తత తీసుకున్న ఐపీఎస్ అధికారి పిన్నిక హరికుమార్ పలు అభివృద్ధి పనులు చేశారు. స్వగ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సర్పంచిగా పోటీ చేస్తున్నట్లు ఆయన సతీమణి శారద తెలిపారు. మంగళకుంట గ్రామానికి ఏళ్ల తరబడి సరైన రహదారి లేకపోవడంతో ఐపీఎస్ అధికారి చొరవతోనే రహదారి వచ్చింది. కలుజువ్వలపాడు నుంచి రూ.3 కోట్లతో తారురోడ్డు వేశారు. గ్రామస్థులతో కలిసి బుధవారం శారద నామినేషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: ఓటు వేయాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే..!