కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నెదర్లాండ్ ఎన్నారైల సహకారంతో నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. కొరిసపాడు మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు చేతుల మీదగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని సోమవరప్పాడు, తిమ్మనపాలెం, తక్కెళ్ళపాడు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీలో నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొని పేదలకు సరకులు అందజేశారు.
ఇవీ చూడండి...