Swimming for Good Health : ఉద్యోగ, వ్యాపార, కుటుంబ బాధ్యతలు ఇలా క్షణం తీరికలేని విధంగా మనిషి జీవితం మారిపోయింది. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఒత్తిళ్ల నడుమ జీవితం సాగిస్తున్నారు. వయస్సుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా పెరుగుతున్న వయస్సుకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆ విషయాన్ని గ్రహించిన విజయవాడ నగర వాసులు ఈతలో శిక్షణ తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని, మానసిక ఎదుగుదలను పెంపొందించుకుంటున్నారు.
ఏ వయసులోనైనా తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ఆరోగ్యానికి చాలా కీలకం. వారానికి కనీసం 150 నిమిషాలపాటు ఒక మాదిరి వ్యాయామం చేయాలని ప్రస్తుత మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో కనీసం తమ కోసం ఓ గంట సమయం కేటాయించుకోలేని పరిస్థితి నెలకొంది. పైగ శారీరక శ్రమ లేకుండా పోయింది. దీంతో ఒత్తిళ్లకు లోనై అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోగాల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామం తప్పని సరి. ఏదో ఒక వ్యాయామం చేస్తున్నంత కాలం శరీరం మన అదుపులో ఉంటుంది. మారుతున్న కాలనికి అనుగుణంగా ప్రస్తుతం అనేక వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి.
రెండు కాళ్లు లేకుంటేనేం! - స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు
అయితే అందరికీ నచ్చేది, ఆరోగ్యానికి మేలు చేసేది స్విమింగ్ ఒక్కటే. ఇది బరువును తగ్గించండంతో పాటు శారీరక ఆరోగ్యానికి పెంచి, ఉల్లాసంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేల మీద చేసే వ్యాయమంతో దెబ్బలు తగులుతాయని భయం ఉంటుంది. కానీ ఈతలో ఆ భయం ఉండదు. సరైన శిక్షకుల పర్యవేక్షణలో మెరుగైన ఫలితాల సాధనకు ఉపకరిస్తుంది. ఇదంతా సాధ్యమవ్వాలంటే సరైన శిక్షణ అవసరం. ఈ తరుణంలోనే విజయవాడ కేఎల్రావుపురంలోని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈత కొలనులో చిన్న పిల్లలతో పాటు 40 సంవత్సరాల నుంచి ఐదు పదులు నిండిన వారు సైతం ఈతలో శిక్షణ పొందుతున్నారు.
కొందరు ఉద్యోగ విరమణ చేసిన వారు, గృహిణులు, ఇతర వృత్తులు చేసుకునే వారు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే తమ ఆరోగ్యానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. ఈతలో మెళకువలు నేర్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారు. మరో వైపు కోచ్ సహకారంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి జబ్బులకు గురికాలేదని, సమయానికి ఆహారం తీసుకుంటూ రోజూ ఈత కోడుతూ తమ ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నామని చెబుతున్నారు.
తమ దగ్గరికి చిన్నపిల్లల నుంచి వయస్సు పైబడినవ వారు సైతం ఈత నేర్చుకునేందుకు వస్తున్నారని, ప్రతి రోజు ఓ గంటపాటు ఈత కొట్టడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని శిక్షకుడు రఫీ చెబుతున్నారు. ఈతలో మెళకువలు నేర్పించి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా ప్రొత్సహిస్తున్నట్లు వెల్లడించారు.
సాహసాల సాహితి- స్విమ్మింగ్‌పూల్‌లో 22గంటలపాటు జలాసనాలు - Woman Yoga Poses in Swimming Pool