ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తాము ఓసీ వర్గానికి చెందితే.. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లలో వికలాంగులుగా నమోదై ఉందని చెప్పారు. గతంలో ఈ పొరపాటును తాము గమనించలేకపోయామని చెప్పారు. ఇప్పుడు ఇంజినీరింగ్ లో చేరాక.. తమను డిజబుల్డ్ విభాగంలో చూస్తూ.. రీయింబర్స్ కు నిరాకరిస్తున్నారని ఆవేదన చెందారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒంగోలు, విజయవాడలో అధికారులను కలసి సమస్య వివరించినా ప్రయోజనం లేదని వాపోయారు. సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి చదివే స్థోమత తమకు లేదని... వికలాంగులకు ఇచ్చే ప్రయోజనాలు ఏవీ తాము పొందటం లేదని తెలిపారు. సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: