ETV Bharat / state

నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే.. - కరోనాతో విద్యుత్ బిల్లులు తాజా వార్తలు

కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది. భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్మును సైతం బయటకు తీయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆరు నెలలు గడిచింది. ఖర్చులు తగ్గించుకోకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు పడక తప్పదన్న ఆలోచన అందరిలోనూ మొదలైంది. నిత్యావసరాల్లో ఒకటైన విద్యుత్తు వాడకం తగ్గించుకోవడం ద్వారా కొంత సొమ్మును ఆదా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలా తగ్గించుకోవచ్చో పొదుపు మంత్రంలో చూద్దాం..

నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే..

author img

By

Published : Oct 17, 2020, 12:24 PM IST

13.28 లక్షల కనెక్షన్లు

ప్రకాశం జిల్లాలో 13.28 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 10.29 లక్షల గృహ అవసరాలు, 97 వేలు వాణిజ్యం కాగా మిగిలినవి పరిశ్రమలు వ్యవసాయం, ఇతర కనెక్షన్లు ఉన్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీంతో ఆర్థిక పరమైన ప్రతి అంశంపైనా ప్రజలు ప్రత్యేక దృష్టి నిలుపుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఇటీవల జిల్లాలో ఫిర్యాదులు కూడా ఎక్కువ అయ్యాయి. పనులు, వ్యాపారాలు లేవు. కారణంగా ఇళ్లల్లోనే ఉండటం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువ అయిందని, ఆ మేరకే బిల్లులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఆ ఒక్కటి దాటనివ్వొద్దు

విద్యుత్ వినియోగాన్ని బట్టి పంపిణీ సంస్థ స్లాబులుగా విభజించి ఛార్జీలు వసూలు చేస్తోంది. నెలలో వంద యూనిట్ల వరకు వాడితే బిల్లు రూ. 202.50 వస్తుంది. ఒక్క యూనిట్ అదనంగా వాడితే స్లాబు మారి రూ.334. 30 అవుతుంది ఇంధన సుంకం, సేవా రుసుము అదనం. యూనిట్లు వంద దాటకుండా చూసుకుంటే నెలకు రూ.131. 80, ఏడాదికి రూ. 1581.6 ఆదా చేసుకోవచ్చు. 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు రూ.780 వస్తుంది. ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా బిల్లు రూ.1007.20 అవుతుంది. అంటే నెల బిల్లు 247. 20 పెరుగుతుందన్న మాట.

ఏ ఉపకరణంపై ఎలాంటి జాగ్రత్త అవసరం

రిఫ్రిజిరేటర్‌: పాత ఫ్రిజ్‌లకు కరెంట్‌ ఎక్కువ కాలుతుంది. డీప్‌ఫ్రిజ్‌లో మంచు గడ్డ కడుతోందంటే కాలం చెల్లినట్లే. పాతదాంతో 166 యనిట్లు కాలితే కొత్త ఫ్రిజ్‌తో వంద యనిట్ల లోపే వస్తుంది. బిల్లులో నెలకు రూ.300కు పైగా ఆదా అవుతుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూడాలి.

వాషింగ్‌ మెషిన్‌: ఎప్పటి దుస్తులు అప్పుడు ఉతికేయడం చాలామందికి అలవాటు. పూర్తిగా లోడు అయ్యాకే వాషింగ్‌ మెషిన్‌ ఉపయోగించాలి. రోజువారీ దుస్తులకు వేడి నీరు అవసరంలేదు.

గీజర్‌: గీజర్‌ ఉన్న ఇళ్లలో 200 యూనిట్లు దాటడంతో బిల్లు రూ.వెయ్యిపైనే వస్తుంటుంది. బిల్లు తగ్గాలంటే ఇంట్లోవారు వెనువెంటనే స్నానాలు చేయాలి. థెర్మోస్టాట్‌ 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్‌ నీటిని వాడేలా పైపులు ఉండాలి.

ఏసీ: సాధారణ రోజుల్లోనూ ఏసీల వినియోగం పెరుగుతోంది. 18-19 డిగ్రీల మధ్య కాకుండా, 24-26 డిగ్రీలు ఉండేలా చూసుకుంటే విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఏసీతోపాటు ఫ్యాన్‌ వేసుకోవడం మేలు. అలానే ఏసీ గదిలో అనవసర వస్తువులు ఉంటే తీసేయాలి.

మెక్రోఓవెన్‌: వండే పదార్థాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. మధ్యలో తరచూ తెరిచి చూడటం వల్ల ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు పడిపోతుంది. మళ్లీ వేడెక్కేందుకు అధిక విద్యుత్తు ఖర్చవుతుంది.

దీపాలు: నాణ్యమైన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లతో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. 10, 20, 22 వాట్స్‌వి సరిపోతాయి. పగలు కిటికీలు తెరవాలి. రాత్రుళ్లు మనం ఎక్కడుంటే అక్కడే బల్బులు వేసుకోవాలి. కొత్త ఇళ్లలో సెన్సర్‌తో పనిచేసే బల్బులు మంచిది. ట్యూబ్‌లైట్లలో త్రీ ఇన్‌ వన్‌ వచ్చాయి. ఒకసారి స్విచ్‌ వేస్తే తెలుపు, రెండోసారి వామ్‌ వైట్‌, వడోసారి తక్కువ వెలుతురుతో వెలుగుతాయి.

అనవసర వాడకం తగ్గించాం

కరోనాకి ముందు ఇళ్లు, హాస్టల్​కు కలిపి నెలకు రూ.9 వేల వరకు విద్యుత్ బిల్లు వచ్చేది. లాక్​డౌన్​లో హాస్టల్లో ఉండేవారు చాలా మంది ఊళ్లకు వెళ్ళిపోయారు. అయినా జూలైలో బిల్లు రూ.6వేలు వచ్చింది. ఆదాయం తగ్గిపోవడం, బిల్లు ఎక్కువ రావడంతో ఆలోచించి అవసరం వాడకాన్ని తగ్గించాం. ఎల్ఈడీ, రిమ్ బస్సులు వాడటం, ఏసీకి బదులు ఫ్యాన్ వేసుకోవడం, టీవీ చూసేటప్పుడు జీరో బల్బులను వాడటం, క్రమం తప్పకుండా రాత్రిలో లైటు అన్ని కట్టేయడం లాంటి చర్యలతో ఆగస్టులో రూ.4500, సెప్టెంబర్ బిల్లు 3400కు తగ్గింది. -హరిబాబు, ఒంగోలు

డిమ్మర్లతో సగం ఆదా

ఏసీ వేసుకుంటే 25 డిగ్రీలకుపైగా ఉండేలా చూసుకోవాలి. అలానే టీవీ చూసేటప్పుడు ఎక్కువ వెలుతురు అవసరం ఉండదు. కాబట్టి డిమ్ లైట్లు వేసుకోవాలి. ముఖ్యంగా కొందరు రిమోట్ విద్యుత్ ఉపకరణాలను ఆపరేట్ చేస్తుంటారు. అలాంటప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మరవకూడదు. ఇలా చేస్తే సగం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ గీజర్లకు బదులు, గ్యాస్, సోలార్ వాడటం, ఎల్ఈడీ బల్బులకు ప్రాధాన్యం ఇవడంతో చాలా వరకు విద్యుత్ ఆదాతో బిల్లు మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.

-ఎం.శివప్రసాద్ రెడ్డి, ఎస్ఈ, విద్యుత్ శాఖ

ఇదీ చదవండి: పదేళ్ల సరిహద్దు వివాదం.. తీరిపోయే సమయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.