ETV Bharat / state

తహసీల్దార్​పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం

author img

By

Published : Jan 15, 2020, 10:24 PM IST

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఓ తహసీల్దార్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు గ్రామ సచివాలయ భవనానికి శంఖుస్థాపన చేయాల్సి ఉండగా... సచివాలయం గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న కారణంగా గ్రామస్థులు వ్యతిరేకించారు. ఒక తహసీల్దార్ సచివాలయానికి మంచి స్థలం చూడలేక పోతే ఆమె ఆ ఉద్యోగానికి అనర్హురాలంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

education minister adhimalapu suresh reddy
తహసీల్దార్​పై ఆగ్రహించిన మంత్రి
తహసీల్దార్​పై ఆగ్రహించిన మంత్రి

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రెవెన్యూ అధికారులపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలంలో పర్యటించిన మంత్రి.. గ్రామ సచివాలయ భవనానికి శంఖుస్థాపన చేయాల్సి ఉంది. సచివాలయ స్థలం గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న కారణంగా గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు.

స్పందించిన మంత్రి తహసీల్దార్, డీటీ లను పిలిచారు. వారు అక్కడ లేని కారణంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ శేషిరెడ్డితో ఫోన్​లో మాట్లాడారు. తహసీల్దార్ చంద్రావతి, డిప్యూటీ తహసీల్దార్ కలీల్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక తహసీల్దార్ సచివాలయానికి మంచి స్థలం చూడలేక పోతే తహసీల్దార్ ఉద్యోగానికి అనర్హులే అన్నారు. ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేలా మరోచోట భూమిని చూడాలని ఆర్డీఓను ఆదేశించారు.

ఇవీ చూడండి:

పోలీసులు, గ్రామస్తుల బాహాబాహీ... ఎందుకంటే..?

Intro:AP_ONG_81_15_MANTHRI_AAGRAHAM_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: పెద్దారవీడు మండలం రెవెన్యూ అధికారులపై విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజక వర్గం లోని పెద్దారవీడు మండలం లో మంత్రి పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా పెద్దారవీడు లో గ్రామ సచివాలయ భవనానికి శంఖుస్థాపన చేసేందుకు వచ్చారు. అయితే సచివాలయ స్థలం గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉండడంతో గ్రామస్థులు వ్యతిరేకించారు. స్పందించిన మంత్రి తహసీల్దార్, డిటీ లను పిలిచారు. వారు అక్కడ లేకపోవడం మంత్రికి ఆగ్రహం చెప్పించింది. వెంటనే ఆర్డీఓ తో శేషిరెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు. ఒక మంత్రి గా ఇక్కడకు నేను వస్తే వారు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే తహసీల్దార్ చంద్రావతి, డిప్యూటీ తహసీల్దార్ కలీల్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక తహసీల్దార్ సచివాలయానికి మంచి స్థలం చూడలేక పోతే ఆమె ఆ ఉద్యోగానికి అనర్హురాలని మంత్రి అన్నారు. ప్రజలకు సౌకర్య వంతంగా ఉండేలా మరో భూమి చూడాలని ఆర్డీఓ కు చూచించారు.

Body:ఆగ్రహానికి గురైన మంత్రి.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.