తమిళనాడులో పట్టుబడిన రూ.5 కోట్లపై విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. చెన్నై పోలీసులు, ఐటీ అధికారులను ఈడీ వివరాలను కోరింది. అన్నా రాంబాబు స్టిక్కర్ ఉన్న కారులో పట్టుబడిన నగదు ఎక్కణ్నుంచి వచ్చాయోనని ఐటీ ఆరా తీస్తోంది. చెన్నైలో ఎవరికి ఇచ్చేందుకు నగదు తీసుకెళ్తున్నారన్న అంశంపై విచారిస్తున్నారు.
ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోడ్ నంబర్‌తో స్టిక్కర్‌తో ఉన్న కారులో 5 కోట్ల రూపాయల నగదు చెన్నైలో చిక్కింది. ఒంగోలుకు చెందిన వ్యాపారి ఈ నగదుతో పోలీసులకు చిక్కాడు. ఒంగోలు నుంచి చెన్నై వెళ్తున్న కారులో చెక్‌పోస్టు వద్ద చేసిన తనిఖీల్లో ఈ నగదు చిక్కింది. ఈ నగదు ఎవరిది అనే అంశంపై కొన్ని రోజుల క్రితం తీవ్ర సంచలనమైంది. అన్నా రాంబాబు స్టిక్కర్ ఉన్న కారులో పట్టుబడిన నగదు ఎక్కణ్నుంచి వచ్చాయోనని ఐటీ ఆరా తీస్తోంది. కాగా ఈ ఆ స్టిక్కర్ నకిలీదని వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.