ETV Bharat / state

Sapota farmers struggle : చితికిపోతున్న సపోటా రైతులు..! - ప్రకాశం జిల్లాలో సపోటా పంట

Sapota farmers struggle : ప్రకాశం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు సపోటా రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. కొన్నేళ్లుగా నష్టాల బారిన పడుతున్న సాగుదారులకు ఈ నష్టం.. మరిన్ని కన్నీళ్లను మిగిల్చింది. దీంతో.. చాలా మంది రైతులు తోటలు కొట్టేసి ఇతర పంటల వైపు చూస్తున్నారు.

Sapota farmers struggle
నష్టాల్లో సపోటా రైతులు
author img

By

Published : Dec 29, 2021, 4:45 PM IST

Sapota farmers struggle : ప్రకాశం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు సపోటా రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. కొన్నేళ్లుగా నష్టాల బారిన పడుతున్న సాగుదారులకు ఈ నష్టం.. మరిన్ని కన్నీళ్లను మిగిల్చింది. దీంతో.. చాలా మంది రైతులు తోటలు కొట్టేసి ఇతర పంటల వైపు చూస్తున్నారు.

జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో సపోటా సాగుచేస్తుండగా.. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే.. దాదాపు ఏడు వేల ఎకరాల్లో సపోటా తోటలు ఉన్నాయి. ఇక్కడ పండే పండ్లు హైదరాబాదు, చెన్నై, నెల్లూరు, విజయవాడ , పొద్దుటూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

కానీ.. కొంత కాలంగా సాగుదారలకు నష్టాలే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇటీవల కురిసిన వర్షాల తీవ్ర ప్రభావం చూపాయి. పంట దిగుబడి భారీగా తగ్గింది. దీనికితోడు దళారీ వ్యవస్థ వల్ల మరింత నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. చాలా మంది రైతులు సపోటా తోటలను కొట్టేసి, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల వర్షాలకు నష్టపోయిన రైతులకు.. ఈ క్రాప్ కింద పరిహారం చెల్లిస్తే బాగుంటుందని కోరుతున్నారు.

ఇదీ చదవండి : PENSIONS HIKE: సామాజిక పింఛన్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.