ప్రకాశం జిల్లా వేలిగండ్ల మండలం కొట్టాలపల్లిలో ఓ నిండు గర్భిణి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండ్ల మానస అనే మహిళ ప్రసూతి కోసం కనిగిరిలో తిరగని వైద్యశాల లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా కనిపించిన ప్రతీ వైద్యశాలకు వెళ్లింది. కరోనా లాక్డౌన్ కారణంగా వెళ్లిన చోటల్లా ఒకటే సమాధానం. ఈ వైద్యశాలలో మేము చేర్చుకోం అని.
నిస్సహాయ స్థితిలో.. దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ పామూరు బస్‌స్టాండ్ సమీపములో ఆమె దిక్కులు చూస్తూ కూర్చుంది. చివరి ప్రయత్నంగా తన గోడును ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు వినిపించింది. స్పందించిన ఎమ్మెల్యే... ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాధితురాలుని ఆసుపత్రిలో చేర్చిచి.. చికిత్సనందించారు.
ఇదీ చదవండి: