కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు... ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా జరిగింది. నిత్యం రద్దీగా ఉండే మార్కాపురం నియోజకవర్గంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. గడియారస్థంభం కూడలి, మెయిన్ బజార్, ఆర్డీఓ కార్యాలయాలు ఖాళీగా కనిపించాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రజలంతా కర్ఫ్యూలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ కరోనా: దేశవ్యాప్తంగా రైళ్లకు రెడ్ సిగ్నల్