ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ - ప్రకాశం జిల్లాలో కరోనా టీకా డ్రైరన్​ వార్తలు

ప్రకాశం జిల్లాలో కొవిడ్‌ టీకా డ్రైరన్​ను కలెక్టర్‌ పోల భాస్కర్‌ ప్రారంభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రై రన్ అనంతరం టీకాను తీసుకున్న వారిని పరిశీలనలో ఉంచారు.

dry run at prakasham district
ప్రకాశం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్
author img

By

Published : Jan 2, 2021, 5:12 PM IST

ప్రకాశం జిల్లాలో కొవిడ్‌ టీకా డ్రై రన్​ను కలెక్టర్‌ పోల భాస్కర్‌ ప్రారంభించారు. ఒంగోలు సర్వజన ఆసుపత్రి, రమేష్‌ సంఘమిత్ర, మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో వైద్య సిబ్బందిపై డ్రైరన్‌ నిర్వహించారు. టీకా వేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ? సాంకేతికంగా వచ్చే లోపాలేమిటి? టీకా ప్రజల్లో ఎలా అవగాహన తీసుకురావాలి? వారి అనుమానాలు ఎలా తీర్చాలి అనే విషయంపై ఈ డ్రై రన్‌ ద్వారా గుర్తించారు. టీకా వేసిన వెంటనే ఆరోగ్య సమస్య తలెత్తితే అందుబాటులో ఆంబులెన్స్, ఎమర్జన్సీ వార్డును సిద్దం చేసి ఉంచుతామని అధికారులు తెలిపారు.. సంయుక్త కలెక్టర్‌ చేతన్‌ డ్రై రన్​ను పరిశీలించారు. టీకాపై ఇప్పటికే పలుమార్లు వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని... డ్రై రన్‌ ఇప్పటికే పక్కాగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు.

మద్దిపాడు

జిల్లాలోని మద్దిపాడు మండలం ఆరోగ్య కేంద్రంలో కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రభుత్వం డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా సిబ్బందికి వ్యాక్సిన్ ఎలా వెయ్యాలో.. ఏ విధంగా పేరు నమోదు చేయాలో తెలిపారు. ఇబ్బంది వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రిహార్సల్ ద్వారా చేసి చూపించారు. ఈ కార్యక్రమానికి జెసీ చేతన్, డీఎంహెచ్ ఓ రత్నావళి మిగతా సిబ్బంది హాజరయ్యారు. .

కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఇప్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ చరవాణి ఉండి దానిని వినియోగించడం తెలిసిన వాళ్లకి మాత్రమే వాక్సిన్ వేసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ముందస్తుగా వారి పేరును గుర్తింపు కార్డుతో నమోదు చేయించుకోవాలి. దానిని పరిశీలించిన అధికారులు చరవాణి ద్వారా మెసేజ్ పంపిస్తారు. దానిని చూసి గుర్తించగలిగిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుతుంది . దీనిపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న వారికి మాత్రమే వాక్సిన్ వేసుకునే అవకాశాలుంటాయి ఇలా ఎన్నో సమస్యలతో వ్యాక్సిన్ ని అందించేందుకు ఈ అవకాశాన్ని కల్పించారు ఇటువంటి చర్యలు పునరుద్ధరించుకొని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.

ఇదీ చూడండి. గుంటూరులో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.