ETV Bharat / state

వెలిగొండ: కరవు మండలాలకు ఏదీ అండ..?

వెలిగొండ ప్రాజెక్టు వస్తే ప్రకాశం జిల్లా సశ్యశ్యామలం అవుతుందనేది అందరి మాట. కానీ.. ప్రస్తుత డిజైన్​లో అత్యవసరమైన మండలాలకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలను దాటుకొని కడప, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు పంపిణీకి ప్రాజెక్టు డిజైన్‌ చేసినా... ప్రకాశం జిల్లాలో అత్యవసరమైన మండలాలకు మాత్రం నీరు అందే అవకాశాలు లేని కారణంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు.

వెలిగొండ
వెలిగొండ
author img

By

Published : Apr 24, 2021, 5:29 PM IST

కరవు మండలాల వ్యక్తుల డిమాండ్

కృష్ణా బ్యాక్‌ వాటర్‌, కొల్లంవాగు వద్ద నిర్మిస్తున్న హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 2 సొరంగాల ద్వారా దాదాపు 43 టీఎంసీల నీటిని తోడి కరవు ప్రాంతాలకు సాగు, తాగునీరు ఇవ్వాలన్నదే వెలిగొండ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 23 మండలాలకు 3.36 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలి. నెల్లూరు, కడప కలిపి 7 మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలతో పాటు, మొత్తంగా 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్నది ప్రణాళిక.

రైతుల పోరాటాలపై పట్టింపేదీ?

ఈ ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తిచేసి, నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఒకటో టన్నెల్‌ పూర్తయ్యింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. జిల్లాలో కరవు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్న ప్రాజెక్టు అయినా.. కొన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా అత్యల్ప వర్షపాతం, తీవ్ర కరవు పరిస్థితులు ఉన్న పొదిలి, మర్రిపూడి మండలాలకు నీటిని పంపిణీ చేసే ప్రణాళికలు లేవు. ఈ విషయంపై ఆయా ప్రాంతాల రైతులు ఎన్నాళ్ల నుంచో పోరాడుతున్నా... పట్టించుకున్న దాఖలాలు లేవు.

2 మండలాల్లో బీళ్లుగా మారిన సాగుభూములు

మార్కాపురం నియోజవర్గంలో కొనగొనమెట్ల వరకూ, పొదిలికి ఓ 10 కిలోమీటర్ల దూరంలో వెలిగొండ కాలువ వెళుతుంది. పొదిలి వద్ద పెద్ద చెరువు ఉంది. చెరువుకు నీటి వనరులు లేక ఇంకిపోయి, చిల్లచెట్లతో నిండిపోయింది. ఈ చెరువువరకూ వెలిగొండ కాలువను విస్తరిస్తే పొదిలి, మర్రిపూడి మండలాలకు పుష్కలంగా సాగు, తాగునీరు అందుతుంది. ఎలాంటి సాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రెండు మండలాల్లో సాగు భూములు బీళ్లుగా మారిపోయాయి.

నీటి సమస్యలతో వలసలు

ఇక్కడి ప్రజలు తాగేందుకు గుక్కెడు నీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. ట్యాంకుల ద్వారా సరఫరా చేసే నీటిమీదే ఆధారపడుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయి బోర్లు పడటం లేదని, నీటి ఇబ్బందుల వల్ల వలస పోతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు కాలువల డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి, పొదిలి, మర్రిపూడి ప్రాంతాలకు వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు ప్రయత్నించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

హయ్యర్ ఎడ్యుకేషన్: విద్యాసంస్థల నిర్వహణపై తర్జనభర్జన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.