చీరాలలో పేదలను ఆదుకునేందుకు పూర్వ విద్యార్థులను ముందుకు వచ్చారు. విజయలక్ష్మి కాన్వెంట్లో 1992 - 93 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు.. చీరాలు ఫైర్ కార్యాలయం గేటు సమీపంలో నివసించే 50 పేద కుటుంబాలకు కూరగాయలు, పాలు, వంటనూనె పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల కష్టాలు చూడలేక తమ వంతు సాయం అందించామని పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి చందు తెలిపారు.
గిద్దలూరు మండలంలో లాక్డౌన్ నిధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు శానిటైజర్లు, మాస్కులను ఉపాధ్యాయులు పిచ్చయ్య పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: