తిరుమల ప్రసాదాన్ని, ఆస్తులను వ్యాపార దృష్టితో చూడటం సరికాదని డోలా బాలవీరాంజనేయస్వామి ఆక్షేపించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన ఆస్తిని ఎలా వేలం వేస్తారని నిలదీశారు. శ్రీవారి భూములను అమ్మాలన్న నిర్ణయంతో లాభపడేది ఎవరని ప్రశ్నించారు. భక్తులా..? లేక తితిదేలోని అధికార పార్టీ బంధుగణమా..? అని దుయ్యబట్టారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆస్తుల వేలం నిర్ణయాన్ని విరమించుకోవాలని డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సుద్దాల అశోక్‌తేజకు కాలేయమార్పిడి చికిత్స విజయవంతం