ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా నిర్ధరణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు నివాసముంటున్న ప్రాంతంలో వైద్య సిబ్బంది ప్రత్యేక సర్వే చేశారు. దాదాపు 100 మంది వైద్యులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. నివాసానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రతీ ఇంటినీ పరిశీలించి, కుటుంబంలో ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే గుర్తించి వారికి తక్షణ వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. కాలనీ మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లి.. ప్రజల్లో అవగాహన కోసం మైకుల్లో ప్రకటనలు చేశారు.
ఇదీ చూడండి:
చీరాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తిపై అవగాహన