సొంత నిధులతో పీపీఈ కిట్లు అందించిన మంత్రి ఆదిమూలపు సురేశ్ - yerragondapalem latest news
కరోనా సమయంలో వైద్య సేవలు అందించే వారికి తమ వంతు సాయం చేయాలని దాతలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కొవిడ్ కేర్ సెంటర్కు పీపీఈ కిట్లను మంత్రి అందజేశారు.

పీపీఈ కిట్ల అందజేత
కరోనా విపత్కర సమయంలో వైద్యసేవలు అందించే వారికి, కొవిడ్ రోగులకు అవసరమైన సహకారం అందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురంలో 200 పీపీఈ కిట్లను తన సొంత నిధులతో అందజేశారు. యర్రగొండపాలెం ఆస్పత్రికి పది ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. అందుకు దాతల సహకారం కూడా అవసరమని మంత్రి అన్నారు. కరోనా బాధితులకు మంచి ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. భోజనంలో మెనూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.