Handicapped pension: వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనును ఇంటి పన్నుకు జమ చేస్తున్నారంటూ.. వారు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం ధర్మవరంలో వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శి వికలాంగులతో వేలిముద్రలు వేయించుకొని పింఛను నగదు చెల్లించకుండా.. ఇంటి పన్నుకు జమ చేసుకుంటున్నారు. ఆ పన్ను రసీదు కూడా తమకు ఇవ్వలేదని, అదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, మరికొందరు బాధిత వికలాంగులు గురువారం ఎంపీడీవో కరీముల్లాకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తమకు పింఛను నగదు చెల్లించేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడతామని తెలిపారు.
ఇదీ చదవండి:
Loans: ఏపీకి రూ.3,716 కోట్ల రుణానికి అనుమతి.. విద్యుత్తు సంస్కరణలకు కేంద్రం నజరానా