రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులమీద దాడులు ఎక్కువయ్యాయని... దళితహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేందర్ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో గాయపడి మృతిచెందిన కిరణ్ కుమార్ కుటుంబసభ్యులను వివిధ ప్రజాసంఘాలతో కూడిన నిజనిర్దరణ కమిటీ పరిశీలనకు వచ్చింది. ముందుగా కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించి... సంఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కిరణ్ కుమార్ మృతికి కారణమైన ఎస్సై విజయ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించకుండా వీఆర్‌కు బదిలీచేయటం ఏమిటని నీలం నాగేందర్ ప్రశ్నించారు. కిరణ్ మృతిపై పారదర్శకమైన విచారణ చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: