ETV Bharat / state

'వెలిగొండ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం' - వెలిగొండ నిర్వాసితుల వార్తలు

ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ చంద్రలీల, మార్కాపురం ఆర్డీవో శేషిరెడ్డిలు ముంపు ప్రాంతాలను సందర్శించారు. ముంపు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

deputy collector  chandra leela visit veligonda thrust areas in prakasam district
వెలిగొండ ముంపు ప్రాంతాలను సందర్శించిన డిప్యూటీ కలెక్టర్
author img

By

Published : Jun 28, 2020, 11:01 PM IST

ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ చంద్రలీల, మార్కాపురం ఆర్డీవో శేషిరెడ్డిలు ముంపు ప్రాంతాలను సందర్శించారు. గుండంచర్ల, కన్నుతల, గొట్టిపడియా రైతులతో సమావేశమయ్యారు. శనివారం గ్రామసభలు నిర్వహించేందుకు వెళ్తున్న అధికారులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ సమస్యలు తీర్చాకే గ్రామాలకు రావాలన్నారు. ఈ క్రమంలో వారికి సర్ది చెప్పేందుకు ఆర్డీవో శేషిరెడ్డి అక్కడకు వెళ్లారు. ఏవైనా సమస్యలు ఉండే తమ దృష్టికి తెస్తే ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. అంతేగాని అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. దీంతో రేపటి నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు గ్రామస్థులు అంగీకరించారు.

గత సర్వేలో అధికారులు నమోదు చేసిన తప్పులను సరిచేయాలని గ్రామస్థులు కోరారు. ప్రభుత్వ లెక్కల్లో లేని వారు చాలా మంది ఉన్నారని అటువంటి వారి పేర్లను నమోదు చేయాలని నిర్వాసితులు కోరారు. స్పందించిన డిప్యూటీ కలెక్టర్ చంద్రలీల.. అప్పటి ఓటరు జాబితా, రేషన్ కార్డు ప్రకారం పేర్లు ఉంటే అటువంటి వారివి తప్పకుండా చేర్చేలా ప్రభుత్వం దృష్ఠికి తీసుకెళ్తామన్నారు.

ఇవీ చదవండి...

అధికారులను అడ్డుకున్న వెలుగొండ నిర్వాసితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.