దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో అమ్మవారు వివిధరూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేటపాలెంలోని కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ వాసవి అమ్మవారికి 108 నైవేథ్యాలతో నివేదన సమర్పించారు. పులిహోర, పొంగలి నుంచి అన్నిరకాల మిఠాయిలను అమ్మవారికి మహిళలు సమర్పించారు. విరూపాక్ష యువజన సంఘం ఆధ్వర్యంలో బాలబాలికల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: శరన్నవరాత్రులు: అమ్మ మెచ్చే నైవేద్యాలివీ!