ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గొర్లగడ్డలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం ఆవరణలో జంతు బలి వ్యవహారం కలకలం సృష్టించింది. మాంసం ముద్దలను ఆలయం ఎదురుగా గమనించిన స్థానికులు.. ఆందోళన చెందారు. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు జంతువును బలి ఇచ్చి మాంసం ముద్దలను అక్కడ పడేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా జంతువు రక్తాన్ని కళ్యాణ మండపం చుట్టూ చల్లినట్లుగా కనబడుతోంది.
ఉదయాన్నే స్థానికులు ఈ దృశ్యాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్శి సీఐ మహమ్మద్ మొయిన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న ఒంగోలు తెదేపా నేత నూకసాని బాలాజీ, పమిడి రమేష్ , మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.
ఇదీ చదవండి: