అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం - prakasham district rain
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంట పాటు కురిసిన వర్షానికి వరి కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. వరద నీటితో మడులు నిండిపోయాయి. పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన ఈ అకాల వర్షం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.