కరోనా వైరస్ వేగంగా వ్యాపి చెందుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కొవిడ్ కేర్ సెంటర్స్ నోడల్ అధికారి సరళ వందనం అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా దోర్నాల తహసీల్దార్ కార్యాలయంలో మండల, గ్రామ స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లాలని సిబ్బందిని ఆదేశించారు. కొవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని కోరారు. హోమ్ ఐసోలేషన్లో ఉండటానికి అవకాశం లేనివారు కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందే వసతి ఉందని.. వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నోడల్ అధికారి సరళ చెప్పారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం