Prakasam district Crime News: ప్రకాశం జిల్లా పామూరు మండలం మన్నేరు వాగు సమీపంలో దంపతులు మృతదేహాలు కలకలం రేపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికంగా పడిఉన్న క్రిమిసంహారక మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మృతదేహాల వద్ద ఉన్న ఆనవాళ్లను బట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఇనిమెళ్ల గ్రామానికి చెందిన ఒంటి పెంట లక్ష్మీ నరసయ్య, వెంకట లక్ష్మమ్మగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. అప్పుల బాధ భరించలేక బలవత్మరణానికి పాల్పడి ఉండొచ్చని ఎస్సై సురేశ్ ప్రాథమికంగా తెలిపారు.
ఇదీ చదవండి..
BANDI SRINIVASARAO : 'ఈనెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తాం'