ETV Bharat / state

పాజిటివ్ వస్తే ఫోన్​ స్విచ్ఛాప్​..అడ్రస్​కు వెళ్తే ఆచూకీ లేదు

తప్పుడు చిరునామా, ఆధార్ నెంబర్లు ఇచ్చి కరోనా పరీక్షలు చేయుంచుకున్న వారిలో పాజిటివ్ వచ్చిన వారు ఆచూకీ లభ్యం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో 300కు పైగా తప్పుడు అడ్రసులు ఇవ్వగా...వీరిలో 150 మందికిపైగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. వీరందరూ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే దానిపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది.

author img

By

Published : Aug 7, 2020, 4:58 PM IST

corona victims
corona victims

ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు జిల్లా అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిలో చాలామంది బాధితులు పత్తా లేకుండా పోయారు. ఆధార్ కార్డులో ఉన్న చిరునామాలలో బాధితులు లేకపోవడం, వారి సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి ఐసోలేషన్లో చికిత్స అందించాలి. కానీ కరోనా సోకిందంటే సమాజంలో, బందువుల్లో చిన్న చూపునకు గురవుతున్నామనే ఉద్దేశ్యంతో వీరంతా తమ చిరునామాలు తప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

పరీక్షల సమయంలో ఇచ్చిన ఫోన్​ నెంబర్​కు సమాచారం వచ్చిన వెంటనే స్విచ్ఛాప్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్​ వచ్చిన వారు విచ్చలవిడిగా తిరుగుతూ వైరస్ ఉద్ధృతికి కారణమవుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో, వైద్యారోగ్యశాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేయడంతో దర్యాప్తు చేశారు.

మొత్తం 300 మందికి పైగా జనాలు తమ అడ్రసులను తప్పుగా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 150 మందికి పైగా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. రోజు వచ్చే పాజిటివ్ కేసుల జాబితాలో 15, 20 మందివరకు తప్పుడు చిరునామాలు ఉన్నట్లు తేలింది. ఈ తరహా కేసులపై అధికారులు, పోలీసులు ప్రత్యేకంగా దృషి సారించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.