ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి..పట్టణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిస్తునట్లు స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, పాల కేంద్రాలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. ఆ తరువాత దుకాణాలు మూసివేయాలని వ్యాపారస్తులకు సూచించారు.
పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 9 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని.. వారితో కాంటాక్టు ఉన్నవారు స్వచ్ఛందంగా వచ్చి కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా పాజిటివ్ కేసులు రావటంతో పట్టణంలోని రహదారులపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు.