ప్రకాశం జిల్లా బల్లికురవ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, విఆర్వోలు మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా ఆదివారం రాత్రి నిర్ధరణ అయింది. ఇప్పటికే మరో ఆరుగురు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి పాజిటివ్‌తో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
నిత్యం గ్రామాల్లో పర్యటించే రెవిన్యూ సిబ్బంది, విఆర్వోలకు కరోనా సోకడంతో మండల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఇవీ చదవండి: ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా బాధితుడు ఆత్మహత్య