ప్రకాశం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కరోనా ప్రభావం అడ్డంకిగా మారింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని గుడ్లూరు మండలంలోని 23... రాచర్ల మండలంలోని 14... అర్ధవీడు మండలంలోని 15 పంచాయతీల్లో కొంతకాలంగా పనులు పూర్తిగా నిలిపివేశారు.
కొనకనమిట్ల మండలంలోని 5.. కారంచేడు మండలం కుంకలమర్రు పంచాయతీల్లోనూ పనులు ఆపారు. తాజాగా పొదిలి మండలం రామాపురంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన కారణంగా అక్కడ ఉన్న 12 పంచాయతీల్లోనూ పనులు నిలిపివేయాలని నిర్ణయించినట్టు డ్వామా ఏపీడీ వెంకట రామిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: