ETV Bharat / state

కరోనా కలవరం.. జిల్లాలో 15కు పెరిగిన పాజిటివ్‌ కేసులు - prakasam district

ఈ వారం ప్రారంభానికి ప్రకాశం జిల్లాలో ఒకే పాజిటివ్‌ కేసు ఉండగా- మంగళవారం నాటికి ఆ సంఖ్య 11కు, ఆ తర్వాత 15కు చేరింది. బుధవారం అందిన నివేదికల ప్రకారం ఒంగోలులో మూడు, చీమకుర్తిలో ఒక పాజిటివ్‌ నమోదైంది. దీంతో ఈ నలుగురి బంధువులు, వారితో కలిసి మెలిగిన వారిని జీజీహెచ్‌ ఐసోలేషన్‌లో చేర్చారు. దిల్లీ వెళ్లొచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది.

prakasam district
ప్రకాశంలో కరోనా కలవరంప్రకాశంలో కరోనా కలవరం
author img

By

Published : Apr 2, 2020, 3:38 PM IST

ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 15కు చేరాయి. క్రమంగా పెరుగుతున్న పరిస్థితుల్లో యంత్రాంగం సైతం అదే రీతిలో అప్రమత్తమైంది. వ్యాప్తిని అరికట్టేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. మూడు దశల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు అమలుచేస్తోంది.

ప్రస్తుతం జీజీహెచ్‌ ఐసోలేషన్‌లో కరోనా అనుమానితులను చేర్చారు. అక్కడ పడకలు సరిపోక కొందరిని స్పెషల్‌ రూముల్లో, మరికొందరిని వైద్య విద్యార్థుల క్వార్టర్స్‌లో చేర్చారు. కేసులు గత నెలలో విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి క్వారంటైన్‌ సమయం పూర్తి కావచ్చినా, వారిని మరో 14 రోజుల వరకు బయట తిరగనీయకుండా ఇంటికే పరిమితం చేయాలని అధికారులు తాజాగా నిర్ణయించారు.

కందుకూరులోనూ నమూనాలు..

వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనుమానితుల నుంచి అత్యధికంగా నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వైద్యులు నమూనాలు సేకరించే పనిలోనే ఉన్నారు. గతంలో ఒంగోలు, చీరాల, మార్కాపురంలో నమూనాలు సేకరించగా, బుధవారం నుంచి కందుకూరులోని ఐసోలేషన్‌ వార్డులోనూ తీయడం ప్రారంభించారు. తొలిరోజు అక్కడ 50 మంది నమూనాలు తీశారు. బుధవారం ఒంగోలు జీజీహెచ్‌లో 20, చీరాల, మార్కాపురంలో కలిపి 60 నమూనాలు తీశారు.

మూడు ల్యాబ్‌లకు..

ఫలితాలు రావడం ఆలస్యమవుతున్న కారణంగా.. మంగళవారం నుంచి మూడు ల్యాబ్‌లకు నమూనాలు పంపుతున్నారు. మార్కాపురం ప్రాంతానికి చెందినవి అనంతపురం ల్యాబ్‌కు, ఒంగోలు, చీరాల నుంచి విజయవాడ, తిరుపతికి, కందుకూరు నుంచి తిరుపతి లేబోరేటరీకి పంపిస్తున్నారు. జిల్లా నుంచి వెళ్లిన నమూనాలకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు నివేదికలు అందలేదు. గురువారం తెల్లవారుజామున వస్తాయని చెబుతున్నారు.

జీజీహెచ్‌ నుంచి క్వారంటైన్‌కు

జీజీహెచ్‌ ఐసోలేషన్‌ ఉంటున్న వారిలో నెగిటివ్‌ వచ్చిన 26 మందిని అక్కడి నుంచి డిశ్ఛార్జి చేసి క్వారంటైన్‌ వార్డుకు పంపారు. వ్యాధి నిర్ధరణ పరీక్షల గురించి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్‌ శ్రీరాములు, టి.మురళీకృష్ణారెడ్డిలను సమాచారం కోరగా... పాజిటివ్‌ వచ్చిన వారితోపాటు, ఐసోలేషన్‌లో ఉన్న వారంతా కోలుకుంటున్నారని చెప్పారు. కిమ్స్‌, సంఘమిత్ర ఆసుపత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నందున అక్కడ కూడా కొంత మందిని చేర్చి చికిత్స అందిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తీసిన నమూనాలు 280 సేకరించగా అందులో 120 ఫలితాలు అందాయని తెలిపారు..

ఇదీ చూడండి:

సామాజిక దూరంపై.. పట్టింపు లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.