ప్రకాశం జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమ, మంగళ వారాల్లో నమోదైన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 191కు చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. రెండు రోజుల్లో నమోదైన 21 కేసుల్లో ఒంగోలులో నలుగురు, టంగుటూరు మండలం కందులూరికి చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
చీరాలలో కూడా ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు నమోదైన 191 కేసుల్లో 114 మంది కోలుకొని డిచార్జ్ అయ్యారు. మిగిలిన వారంతా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి రాకపోకలపై నిషేధం విధించారు. బ్యారికేడ్లు వేసి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇవీ చూడండి:
కృష్ణంరాజువారిపాలెంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వసంతోత్సవం