ETV Bharat / state

జిల్లాలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Jun 12, 2020, 11:22 AM IST

ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం మరో 6 కొత్త కేసులు నమోదు కావటంతో...జిల్లాలో కేసుల సంఖ్య 146 కు చేరింది. లాక్​డౌన్ సడలింపుల తరువాత ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రాకపోకలు జరగటం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువైంది.

జిల్లాలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు
జిల్లాలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు

ప్రకాశం జిల్లాలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 146 కు చేరుకున్నాయి. లాక్​డౌన్ సడలింపుల తరువాత ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రాకపోకలు జరగటం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లివచ్చిన ఒకే కుటుంబంలోని ఇద్దరికి కరోనా సోకింది. చినగంజాం మండలంలో తండ్రీ కుమారుడుకి, కనిగిరి మండలంలో తల్లీ కుమార్తెకు కరోనా పాజిటివ్​గా తేలింది.

చీరాల పట్టణంలో రెండు పాజిటివ్ కేసులు నమోదుకావటంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని జయంతిపేటకు చెందిన దంపతులకు పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్ గా ప్రకటించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారిచేశారు. 200 మీటర్ల పరిధిలో రహదారులను మూసివేయించి పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.