ETV Bharat / state

చేయి తడిపితే కొనుగోళ్లు... లేదంటే కొర్రీలు!

మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు.. ఆర్‌బీకేల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్వింటాకు రూ.1880 మద్దతు ధర కల్పించి.. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తోంది. అవసరమైన గోతాలను సైతం సదరు సంస్థే సమకూరుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రకాశం జిల్లాలోని చాలా కేంద్రాల్లో స్థానిక నాయకులు, సిబ్బంది పెత్తనం కారణంగా రైతులకు ఆ ప్రయోజనం లభించడం లేదు.

మొక్కజొన్న బస్తాలు
మొక్కజొన్న బస్తాలు
author img

By

Published : May 9, 2021, 5:04 PM IST

బల్లికురవ మండలం గుంటుపల్లిలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అనధికారికంగా నగదు వసూలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ వారు పంపిన గోతాలు సైతం ఇవ్వడం లేదు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా... ఎటువంటి స్పందన లేదు. ఏం చేయాలో తెలియక క్వింటాకు రూ.210 చొప్పున సమర్పించుకుని పంటను అమ్ముకోవాల్సి వచ్చింది.

- గుంటుపల్లికి చెందిన ఓ రైతు ఆవేదన

మొక్కజొన్న పంటను విక్రయించేందుకు రిజిస్ట్రేషన్‌ చేస్తే గత నెల 20న కొనుగోలు చేస్తామంటూ చరవాణికి సమాచారం ఇచ్చారు. నేటికీ కొనుగోలు చేయలేదు. కేంద్రానికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి సిబ్బంది దాటవేస్తున్నారు. మరోవైపు వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఏ మాత్రం వర్షం పడినా చేతికందిన పంట పూర్తిగా పాడవుతుంది.

- కొమ్మినేనివారిపాలేనికి చెందిన మరో రైతు ఆందోళన

మొక్కజొన్న ధర క్వింటాకు రూ.150 కమిషన్‌, రెండు గోతాలకు రూ.60... మొత్తం రూ.210 ముందస్తుగా చెల్లిస్తేనే సరకు తీసుకుంటున్నారు. దీంతో రైతుకు నికరంగా రూ.1670 మాత్రమే అందుతోంది. అడిగిన మొత్తం ఇవ్వకుంటే... ఏదో ఒక సాకు చెప్పి వెనక్కి పంపేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా... పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కేంద్రాల వద్ద కొనుగోళ్లు జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగిన కమిషన్‌ ఇస్తే కల్లాల వద్దకే నేరుగా వెళ్లి కాటా వేస్తున్నారు. ఇందుకోసం రవాణా ఛార్జీల పేరిట అదనంగా మరింత వసూలు చేస్తున్నట్లు సమచారం.

పేరుకే నిబంధనలు

రైతులు తమ పంటను విక్రయించుకోవాలంటే ఈ-క్రాప్‌ చేసి ఉండాలి. రైతు భరోసా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక... ఎప్పుడు పంట కొనుగోలు చేసేదీ చరవాణికి సమాచారం వస్తుంది. ఆ మేరకు కొనుగోలు కేంద్రానికి ఉత్పత్తి తీసుకువెళ్లాలి. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కొన్ని కేంద్రాల్లో కమిషన్‌ ఇచ్చిన వారి పంటనే తీసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల నాయకుల సిఫార్సు తప్పనిసరిగా మారింది. లేదంటే ఏదో ఒక సాకు చెప్పి వెనక్కు పంపుతున్నారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో చేసేదిలేక ఎంత అడిగితే అంత సమర్పించుకుంటూ రైతులు తమ పంటను విక్రయించుకోవాల్సి వస్తోంది.

ఇదో రకం దందా

అవగాహన లేక ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోని రైతులు చాలా మందే ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించుకునే అవకాశం వీరికి లేదు. దీనిని కూడా అక్రమార్కులు అవకాశంగా మలుచుకుంటున్నారు. అటువంటి రైతుల వద్ద కమిషన్‌కు తోడు... క్వింటాకు ఇంత మొత్తం చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచీ ఇలాగే తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన పంటను... అప్పటికే ఈ-క్రాప్‌ చేయించుకున్న ఇంకొదరి రైతుల పేరిట అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. ●జిల్లాలో మొత్తం 52 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సొసైటీల పరిధిలో 36, ఏఎంసీలు... 12, డీఆర్‌డీఎ ఎఫ్‌టీవోలు... 3, ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో ఓ కేంద్రం నడుస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 11,700 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు ముందుగానే గోతాలు అందజేశాం. పంట అమ్మే రైతులు కేవలం హమాలీ, కాటా వేసినందుకు కూలీల ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. కేంద్రాల వద్దే కొనుగోలు చేయాలి. కాదని, పొలం వద్ద కొనుగోలు చేసినా... రైతుల నుంచి ఎటువంటి రవాణా ఛార్జీలు వసూలు చేయరాదు. ఎవరైనా అదనంగా వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే... విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. - హరికృష్ణ, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

ఇదీ చదవండి:

కొవిడ్ ఎఫెక్ట్: జీడిపిక్కల ఫ్యాక్టరీల్లో తగ్గుతున్న కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.