కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఒంగోలులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ నుంచి, కలెక్టర్ కార్యాలయం వరకు ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
రైతుల నడ్డి విరిచే విధంగా, దళారీలకు అనుకూలంగా ఈ బిల్లుల్లో ప్రతిపాదనలు ఉన్నాయని వారంతా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: