Rain effect to tenth exams: ప్రకాశం జిల్లా పొదిలిలో పదో తరగతి పరీక్షల్లో గందరగోళం నెలకొంది. గాలివాన బీభత్సానికి పరీక్షా కేంద్రాలు తడిసి ముద్దయయ్యాయి. ఈదురుగాలుల వర్షానికి విద్యార్థులు గంటపాటు ఇబ్బందిపడ్డారు. పరీక్షాకేంద్రాల్లో సరైన వెలుతురు లేక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అవస్థలు పడుతున్నామని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది కలిగినచోట పరీక్షకు అదనపు సమయం ఇవ్వాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు.
ఉరుములు-మెరుపులతో కూడిన వర్షం: గత నాలుగు రోజులుగా ఎండలు మండుతున్నాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. దర్శిలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రోహిణి కార్తె సమీపిస్తున్న తరుణంలో వర్షం పడటం వల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆ ప్రాంతాల్లో పిడుగులు.. జాగ్రత్తగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ