ETV Bharat / state

conflict : 'ఆ పదవి మాకు కావాలి... కాదు మాకే కావాలి' - prakasam district crime news

ప్రకాశం జిల్లా మార్టూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘర్షణ నెలకొంది. వైస్ ఎంపీపీ పదవి కోసం వైకాపాలోని ఇరువర్గాలు గొడవ పడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

మార్టూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
మార్టూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
author img

By

Published : Sep 24, 2021, 4:45 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండల కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్టూరు వైస్ ఎంపీపీ పదవి మాకంటే మాకు అంటూ వైకాపాలోని రెండు వర్గాలు పోటీపడ్డాయి. ఈ పదవికి దాశం అశోక్​కుమార్ పేరును ప్రకటించగా... కొనంకి ఎంపీటీసీ సభ్యుడు గుంటుపల్లి శివకృష్ణ తనకే పదవి కావాలని పట్టుబట్టారు. దీంతో మార్టూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇరు వర్గాల శ్రేణులు భారీగా చేరుకుని ఘర్షణకు దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నించారు. యద్దనపూడి ఎంపీపీ పదవికీ వైకాపాలో రెండు వర్గాల మధ్య వివాదం రావటంతో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సయోధ్యతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరువర్గాలు వెల్లడించారు.

ఇదీచదవండి.

SRISAIALM KUMARASWAMY TEMPLE: ఆలయ నిర్మాణ పనులను అడ్డుకున్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.