ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 29 అంశాలతో సమావేశం ఏర్పాటు చేయగా.. తమకు తెలియకుండానే తమ వార్డుల్లో కార్యక్రమాలు చేపడుతున్నారని వైకాపాకు చెందిన వర్గంపై మరోవర్గం కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మీరు పార్టీ గుర్తు మీద గెలుపొందలేదని, అధికారపార్టీకి చెందిన మరో వర్గం కౌన్సిలర్లు ఎద్దేవా చేశారు. పరస్పర ఆరోపణలతో సమావేశం రసాభాసగా మారింది.
విషయం తెలుసుకున్న చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇరు పక్షాల వారిని శాంతిపజేసి వాగ్వాదానికి దిగిన పలువురు కౌన్సిలర్ల భర్తలను స్టేషన్కు తరలించారు. కౌన్సిల్ కార్యాలయంలోకి ఇతర వ్యక్తలు వచ్చి గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారని మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు కౌన్సిల్ అజెండాలో సంబంధం లేని అంశాలపై వాదోపవాదాలు జరిగాయన్నారు.
ఇదీ చదవండి
GOVT LANDS: స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. 'నిరుపయోగ భూములు'!