జిల్లాలో సచివాలయాల ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలను అందించడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. మార్కాపురంలోని 12వ వార్డు సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసి దస్త్రాలను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం విధించిన గడవులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అక్కడున్న సిబ్బందికి సూచించారు. జిల్లాలో గ్రామ సచివాలయాల అభివృద్ధికి ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్నారు. పట్టణంలోని రహదారులు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి...