ప్రకాశం జిల్లా ఒంగోలులో తహసీల్దార్లు, విద్యుత్ శాఖ ఏఈ లతో జిల్లా కలెక్టర్ పోలా బాస్కర్ సమావేశం నిర్వహించారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడంపై రైతుల్లో ఆందోళన తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ సభల నిర్వహణ, బహిరంగా ప్రదేశాలలో పోస్టర్లు అంటించడం, మైకులతో ప్రచారం చేయడం ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి విద్యుత్ మీటర్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయాల స్థాయిలో వీఆర్వోలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులతో ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అన్నారు. రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు ప్రభుత్వమే ఈ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: